చక్కని కండగల తెలుగు భాషకు కలకండ చేర్చి ప్రేమను అందులో రంగరించి అక్షర మాలికలు అల్లిన సంస్కారవంతమైన కవి ఆకుల రఘురామయ్య. తన జ్ఞాపకాల పందిరిలో కదిలే మెదిలే భావాలను స్మృతులను అలతి అలతి పదాలతో లలితంగా, కలితంగా, మహితంగా ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం. అభినందనీయం.

-పి విజయ బాబు అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఒక చేత్తో హలం, మరో చేత్తో కలం పట్టుకుని అనంత మట్టి దారుల్లో అభ్యుదయ కాంతిని ప్రసరింపజేస్తూ... అనంత కవితా క్షేత్రాన్ని తనదైన ప్రతిభతో సుసంపన్నం చేస్తున్న అనంత కవితా కృషీవలుడైన ఆకుల రఘురామయ్య చేసిన స్ఫూర్తి సంతకమే ఈ స్మృతి కవిత్వం. మహనీయుల స్మృతిపధంలో రచించిన ఈ "జ్ఞాపకాల పొరల్లో...." కవితా సంపుటి అచ్చం ఆ మహనీయుల జీవితాల్లాగే చిరంజీవిగా నిలిచిపోతుంది. ఇది అక్షరమంత నిజం. ఇది కవిత్వమంత సత్యం.

- డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ కవి,పాత్రికేయులు