Sabbani Samagra Telangana Sahithyam
Format: 15.2x22.9cm
Liczba stron: 370
Oprawa: Miękka
Wydanie: 2023 r.
Język: telugu
Dostępność: dostępny

ఇది 12 భాగాల మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నేను వ్రాసిన పుస్తకములను అన్నింటిని కలిపి సమగ్ర సాహిత్యంగా తీసుక రావాలని గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా అనుకుంటున్నాను. కానీ చాలా బద్ధకస్తున్ని నేను. రోజులు, నెలలు ,సంవత్సరాలు దాటిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 2024 జూన్ నాటికి పదేండ్లు అవుతుంది. పుస్తకాలు కూడా రచయితలకు బిడ్డల లాంటివే, వాటి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత కూడా రచయితలదే. అలా ఇప్పటికీ ఆలస్యం అయినప్పటికీ గుది గుచ్చిన సాహిత్య హారంగా ఈ 'సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యం' వెలువడుతుంది. మొదటి నుండి తెలంగాణ దగాపడ్డ నేలనే! అడుగడుగున అన్యాయానికి గురి అయిన తెలంగాణా గురించి అధ్యయనం చేస్తుంటే టప్పుటప్పున కన్నీటి బొట్లు కార్చిన సందర్భాలు ఎన్నో! మనసా వాచా కర్మణా 2001 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు నేను విస్తృత అధ్యయన శీలిగా ఉద్యమ అవసరాల దృష్ట్యా 12 పుస్తకాలు వెలువరించాను, పత్రికల కోసం కూడా రాశాను.కాలానికి ప్రతిబింబం కవిత్వం ఎప్పటికైనా. తెలంగాణ మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమం (2001-2014) వివిధ దశలను పుణికి పుచ్చుకొని పుట్టిన పుస్తకాలు ఇవి. వివిధ విశ్వ విద్యాలయాల తెలుగు శాఖల ఆచార్యులు , తెలంగాణ విశ్వ విద్యాలయాల తెలుగు శాఖల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, పాఠకులు వీటిని ఆదరించి అక్కున చేర్చుకుంటారని కోరుకుంటున్నాను. తెలంగాణ పాఠ్య పుస్తక రచయితలు, పాఠ్యపుస్తకాల ప్రణాళిక సంఘ రచయితలు తెలంగాణ నేల కోసం పుట్టిన ఈ రచనలను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.